భద్రాచలంలో వసతి గదుల అద్దె పెంపు

Telugu Lo Computer
0


తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి భద్రాచలం. రాములవారు కొలువుదీరిన భద్రాచలం కు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శ్రీరామ నవమి సమయంలో భక్తులు ఎక్కువగా వస్తుతుంటారు.        భద్రాచలం లోని రోజు వారీ వసతి గదుల అద్దె పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుండి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. పెరిగిన ధరలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏది గది ధర రోజుకు రూ.800 ఉండగా ఇప్పుడు రూ.999 అయ్యింది. నాన్ ఏసి గది ధర రూ. 300 ఉండగా ఇప్పుడు రూ.400 అయ్యింది. అదే విధంగా డబుల్ బెడ్ రూం ధర రూ.1500 ఉండగా ఇప్పుడు రూ.2,500 అయ్యింది. సింగిల్ బెడ్ రూం ధర రూ.800 ఉండగా ఇప్పుడు రూ.1000కి పెరిగింది. పెరిగిన ధరలతో పాటూ 12శాతం జీఎస్టి అదనంగా వసూలు చేయనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)