ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లలో ఛార్జింగ్ స్టేషన్‌లు ?

Telugu Lo Computer
0


తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లలో ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషిస్తున్నాయి. సబ్ స్టేషన్లలో తగినంత స్థలం ఉన్నందున, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌, టీఎస్‌ఆర్‌ఈడీసీవోలు ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో పడ్డాయి. ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు ఇంకా సిద్ధం కానప్పటికీ, ఈ-వాహన యజమానుల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి అధికారులు దీనిని దృష్టి పెట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఛార్జింగ్ యూనిట్లకు విద్యుత్ సరఫరాను పొందడానికి ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలతో పాటు తగినంత స్థలం లభ్యత ఉండటంతో సబ్‌ స్టేషన్లలో ఛార్జింగ్ యూనిట్లను ఏర్పాటుకు అనుగుణంగా ఉంటాయని భావిస్తున్నారు. అనేక సబ్‌ స్టేషన్లలో ఉన్న ఖాళీ స్థలం, ముఖ్యంగా హైవేలపై సులభంగా 20 వాహనాలకు ఒకేసారి వసతి కల్పించే అవకాశం ఉంటుంది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌, టీఎస్‌ఆర్‌ఈడీసీవోలు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలపై చర్చించారని, అయితే ప్రక్రియను వేగవంతం చేయడానికి బ్లూప్రింట్‌ను సిద్ధం చేయాల్సి ఉందని వర్గాలు తెలిపాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 415 సబ్‌ స్టేషన్‌లలోని మిగులు స్థలాన్ని ఛార్జింగ్‌ యూనిట్‌లను ఏర్పాటు చేసేందుకు ఉపయోగించుకోవచ్చని ఓ అధికారి తెలిపారు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 68 నగరాల్లో 2,877 ఈ-వాహన ఛార్జింగ్ స్టేషన్లను మంజూరు చేసింది. భారతదేశంలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ (ఫేమ్ ఇండియా) పథకం యొక్క ఫేజ్-II కింద తొమ్మిది ఎక్స్‌ప్రెస్‌వేలు, 16 హైవేలలో 1,576 ఛార్జింగ్ స్టేషన్‌లు మంజూరు చేయబడ్డాయి. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి మంత్రిత్వ శాఖ రూ.1,000 కోట్లు కేటాయించింది. నవంబర్ 8, 2021 నాటికి, తెలంగాణలో 136 ఛార్జింగ్ స్టేషన్‌లు పనిచేస్తున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)