నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Telugu Lo Computer
0


ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర హోంశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను మరోసారి కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించవారికి రూ. 100 జరిమానా విధించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాస్కులేని వారిని దుకాణాల్లో, వాణిజ్య ప్రదేశాల్లో, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధించనున్నారు. ఎవరైనా సరే ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థలను 2 రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)