స్వయం సహాయక సంఘాల మహిళలకు ఒక్కొక్కరికి రూ.5 వేలు!

Telugu Lo Computer
0


గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రూ.5,000 కి అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది.  ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఒక రకమైన రుణం అనే చెప్పుకోవచ్చు. దీంతో బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు పొందవచ్చు. ఎక్కువగా తీసుకున్న డబ్బులను నిర్ణీత గడువులోగా మళ్లీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులకు వడ్డీ కూడా పడుతుంది. బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు దీనిని ఇస్తాయి. ఈ ప్రయోజనం స్వయం సహాయక గ్రూప్‌లోని మహిళలకు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. వెరిఫైడ్ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రూ.5 వేలు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అందిస్తామని కేంద్రం తెలిపింది. అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ కింద ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఈ ఫెసిలిటీకి 5 కోట్ల మంది మహిళలు అర్హులనే అంచనాలున్నాయి.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)