మంచు ఫ్యామిలీ లో కులాంతర వివాహాలు

Telugu Lo Computer
0


తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న కుటుంబాల్లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ కూడా ఒకటి. అగ్ర నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా.. ఇలా పలు రంగాల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇక ఇటీవల ముగిసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ ఎన్నికలను తలపించే విధంగా ఎంతో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై గెలుపొందిన మంచు విష్ణు పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో మా ఎన్నికల పుణ్యమా అని మంచు వారి కుటుంబం గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు తన పిల్లలకు సంబంధించిన పెళ్లి విషయాల్లో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఈ క్రమంలోనే కులాంతర వివాహాలకు సైతం ఆయన ఒప్పుకున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మోహన్ బాబు స్వయానా తన మరదల్ని వివాహం చేసుకున్నాడు. మోహన్ బాబు పిల్లల విషయానికొస్తే.. ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు రెడ్డి వర్గానికి చెందిన వెరోనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి ఎవరో కాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న కుమార్తె. ఇక రెండో కుమారుడు మనోజ్ మాజీ భార్య ప్రణతి రెడ్డి కూడా రెడ్డి వర్గానికి చెందిన అమ్మాయి. మనోజ్, ప్రణతి ల మధ్య కొన్ని మనస్పర్ధలు కారణంగా వారి ఇద్దరు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక  మోహన్ బాబు గారాలపట్టి, మంచు వారసురాలు లక్ష్మీ ప్రసన్న కూడా లక్ష్మి కులాంతర వివాహం చేసుకున్నారు. మంచులక్ష్మి భర్త బ్రాహ్మణ వర్గానికి చెందిన వాడు. ఆయన ఒక ఎన్నారై అనే విషయం తెలిసిందే. ఇలా తన కుటుంబంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారిని తన కుటుంబంలో స్థానం కల్పించారు మోహన్ బాబు...!

Post a Comment

0Comments

Post a Comment (0)