ప్రధాని మోదీ వాటికన్ సందర్శన

Telugu Lo Computer
0

రోమ్‌లో జరుగుతున్న జీ20 సదస్సుకు వెళ్లిన మోదీ అక్కడ ఫ్రాన్సిస్‌ను కలిసి పూర్తిగా సిల్వర్‌తో తయారు చేసిన క్యాండిల్ స్టాండ్‌ను పోప్ ఫ్రాన్సిస్‌కు ప్రధాని మోదీ బహూకరించారు. క్యాండిల్ స్టాండ్‌తో పాటు ఓ పుస్తకాన్ని కూడా ఫ్రాన్సిస్‌కు అందజేశారు. వాతావరణ నియంత్రణకు ఇండియా కట్టుబడి ఉన్న అంశాలతో కూడిన పుస్తకాన్ని పోప్‌కు మోదీ అందించారు. పోప్‌ ఫ్రాన్సిస్ కూడా మోదీకి ఓ గిఫ్ట్ ఇచ్చారు. బ్రాంజ్‌తో తయారు చేసిన ఓ సర్క్యులర్ మెమోంటోను అందజేశారు. బైబిల్ సూక్తులతో ఉన్న ఆ గిఫ్ట్‌ను మోదీ అందుకున్నారు. ఇండియాకు రావాలంటూ ఫ్రాన్సిస్‌ను  మోదీ ఆహ్వానించారు. ఇద్దరి మధ్య 55 నిమిషాల పాటు భేటీ జరిగింది. 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి వాటికన్‌ను సందర్శించి రెండవ జాన్ పౌల్‌ను ఆయన కలిశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)