కళకళలాడుతున్న ట్యాంక్ బండ్

Telugu Lo Computer
0


సందర్శకులతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వాతావరణం సందడిగా మారింది. ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షల అమలుతో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు నగరవాసులు.. నో ట్రాఫిక్ జోన్ అమల్లోకి రావడంతో హుస్సేన్ సాగర్ కొత్తగా కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వరకు ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు వున్నాయి. రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో ఫ్యామిలీ & పిల్లలతో ట్యాంక్ బండ్ కళకళలాడుతోంది. ట్యాంక్ బండ్ మీద కుటుంబాలతో కాలక్షేపం చేసేలా మార్పు చేయాలని ఒక నెటిజన్ కోరడంతో అందుకు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే. అగస్ట్ 29 నుంచి నో ట్రాఫిక్ జోన్ అమలవుతుండగా.. ఈరోజు మాత్రం నగరవాసులు భారీగా ట్యాంక్ బండ్ పైకి వచ్చారు. అత్యాధునిక హంగులతో.. సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. ట్యాంక్ బండ్ కు ఇరువైపులా ఉన్న ఫుట్ పాత్ లను పూర్తిగా తొలగించి ఆధునీకరించారు. విశాలంగా ఉన్న ట్యాంక్ బండ్ మీద గ్రానైట్ రాళ్లను ఫుట్ పాత్ లను తీర్చి దిద్దారు. హైదరాబాద్ రుచుల్ని చూసేందుకు ప్రత్యేకంగా ఫుడ్ ట్రక్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)