ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం మేమే అడిగాం

Telugu Lo Computer
0



ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వంతో చర్చలు జరగడం చాలా ఆనందకరమైన విషయమని  టాలీవుడ్‌ నిర్మాత సి.కళ్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలన్నింటిని ఓపిగ్గా విని పరిష్కారం చూపుతామని మంత్రి పేర్ని నాని చెప్పినట్లు పేర్కొన్నారు. దివంగత వైఎస్సార్‌ సినీ ఇండస్ట్రీకి ఎంతో చేశారని నేడు సీఎం జగన్‌ కూడా అలాగే చేస్తున్నారని ఆయన అన్నారు.   ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్‌ రాజు, డీఎన్‌వీ ప్రసాద్‌, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. భేటీలో ప్రధానంగా ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు. ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం తామే అడిగామని నిర్మాత కళ్యాణ్‌ పేర్కొన్నారు. దానితో పాటు 4 షోలు 12 గంటలలోపు పూర్తి చేయడంపై చర్చించినట్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల అంశం, 100 శాతం ఆక్యుపెన్సీపై కూడా చర్చించామన్నారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్ని ప్రభుత్వం చెప్పిందని త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ అవుతామని వెల్లడించారు. ఆన్‌లైన్‌​ విధానం వలన సినీ పరిశ్రమకి మేలు జరుగుతుందని నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంతో పాటు రేట్లు సవరించని కోరినట్లు తెలిపారు. అన్ని సమస్యలపై మంత్రి తో చర్చించామని, ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పిందని వెల్లడించారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)