వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు !

Telugu Lo Computer
0


వసుదేవుడు కంసుని పెదతండ్రి కుమార్తె అయిన దేవికను పెళ్లి చేసుకుని కంసుడు వెంటరాగా రథంలో తన నగరానికి బయల్దేరతాడు. మార్గమధ్యంలో ఆకాశ వాణి ఆకాశంనుండి కంసునితో"ఓయీ!కంసా! ఈదేవకి అష్టమగర్భాన పుట్టబోయే పుత్రునిచేతిలో నీకు మరణం ఉన్నది" అని చెబుతుంది. ఆగ్రహించిన కంసుడు దేవకిని చంపబోగా వసుదేవుడు అడ్డుపడి ఆమెకు పుట్టిన బిడ్డలను అప్ప గిస్తానని నిష్కారణంగా ఆమెను చంపవలదని ప్రాధేయపడగా కంసుడు దేవకీ వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. మాట ప్రకారం దేవకీ పుత్రులను ఎప్పటికప్పుడు అప్పగిస్తాడు వసు దేవుడు. అష్టమగర్భంగా ఒక అర్థరాత్రి దేవకీదేవి శ్రీ కృష్ణుడికి జన్మ యిస్తుంది. దేవుని ఆదేశం ప్రకారం వసుదేవుడు బిడ్డను తీసుకుని రేపల్లె బయల్దేరతాడు. రేపల్లెకు చేరుకుంటూండగా దారిలో ఒక గాడిద ఓండ్రపెట్టిందట. కంసుని భటులకు తెలుస్తుందని భయపడిన వసు దేవుడు గాడిద కాళ్లు పట్టుకుని అరవ వద్దని వేడుకున్నాడట. ఆ తరువాత వసుదేెవుడు శ్రీకృష్ణుడిని యశోద ప్రక్కలో వుంచి,ఆమెకు పుట్టిన యోగమాయను తీసుకుని వెళ్లడం మనకు తెలిసిందే. ఈ కథ ఆధారంగా "వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు" అనే సామెత పదం పుట్టింది. కొన్ని కొన్ని సమయాలలో మనకు అయిష్టులైన అధములను,నీచులను కూడా ప్రాధేయపడవలసి వస్తుందని దీని భావం.


Post a Comment

0Comments

Post a Comment (0)