ఓమ్ కారం

Telugu Lo Computer
0

ఓమ్ అకార ఉకార మకారాల సమ్మేళనం ఓమ్ కారం. ఓమ్ ఉచ్చారణ తర్వాత వినిపించే శబ్దం అర్థమాత్ర ఇది ఇందులోనే ఉంది. ఈ అర్థమాత్రను ఏకాగ్రత ద్వారా వినవచ్చు. సృష్టికి మొట్టమొదట వినిపించిన శబ్దం ‘ఓమ్’ మాత్రమే. సృష్టికి ముందు తర్వాత ఉండేది శాశ్వతమైందీ ఈ ఏకాక్షర ఓమ్ కారమే. చతుర్ముఖ బ్రహ్మ ఈ ఓమ్‌కార జపం తోనే ఋగ్వేద, యజుర్వేద సామవేదాలను గ్రహించాడు. ఓమ్ కారం సర్వశ్రేష్ఠం. సర్వోన్నతం. ఓం కారం పదేపదే జపించడం ద్వారా ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. కార్బన్‌డైఆక్సైడ్ శాతం తగ్గుతుంది. సంపూర్ణ ఆరోగ్యానికి మంచి మందు ‘ఓమ్’కారం.

పరమేశ్వరోపాసన చేసే వారు ఓం అని ఉచ్చరిస్తూ ఉంటే అమ్మవారి మంత్రోపాసన చేసేవారు శ్రీం అనే బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు.

శ ర ఈ అనే మూడక్షరాల కలయిక శ్రీకారం. మహాలక్ష్మీ స్వరూపం. ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తుల ప్రతీక శ్రీకారం. ‘శ’, ‘ర’, ‘ఈం’ కారాలను కలిపితే శ్రీం ఇది జగన్మాత బీజాక్షరం. శ్రీం అంటే శ్రీవిద్యాబీజం. ‘శ్రీం’లో ‘శ, ర, ఈ’లతో పాటుగా పూర్ణానుస్వారం ఉంది. ర అంటే ధనం, ఈ అంటే తుష్టీనాద, పర, రం దుఃఖం దూరమగుట అని అర్థాలున్నాయి.

"ఆన్ని మంత్రాలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం' దీనినే ప్రణవమని అంటారు. మంత్రోచ్చారణం జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. సనాతనమైన హిందూ ధర్మమునందు ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. సర్వశ్రేష్ఠుడైన భగవంతునికి ఆకార రూపం (నామ) నాదరూపం ఓంకారము. ప్రణవనాదము, ప్రధమ నామము, ఏకాక్షరమైన ఓంకారము. ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకార ము నుంచే యావత్తు జగము ఉద్భవించింది.

వేదముల యొక్క సారము ఓంకారము. ఓం' అంటే ప్రారంభాన్ని తెలుపునది కూడా. ఏకాక్షర మంత్రము, భగవంతుని ముఖ్యనామమైన ఓం'కు అనేక అర్థాలు కలవని రుషులు తెలియజేశారు. బ్రహ్మనాదము ఓంకారము. ఆత్మ ఓంకార మంత్ర స్వరూపము ప్రణవనాదమే ప్రాణము. ప్రధమ నాదము ఓంకారము. అకార, ఉకార, మకారములను మూడు అక్షరముల కలయిక వలన ఓంకారము ఉద్భవించినది.

ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి.

అందులో అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు.

శబ్దమే భగవంతుడని చెప్పబడింది. ప్రతిపదమునకు మూలాధారముగా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది. శబ్దోచ్చారణలో మనం కంఠంలోని స్వరపేటికను,అంగిలిని, శబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాము.

ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందా? ఆ శబ్దమే ప్రణవము లేక ఓంకారము.

ఇందులో అ,ఉ,మ లు ఉన్నాయి.

నాలుకలోని, అంగిలిలోని ఏ భాగము కూడా ‘అ ‘కార ఉచ్చారణ కు తోడ్పడదు. ఇది ఓంకారానికి బీజం గా ఉంది .చివరిది ‘మ ‘కారము.పెదవులని మూసి దీన్ని ఉచ్చరిస్తారు .

నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయములో దొర్లుకుంటూ ఉంటుంది.ఇలా శబ్ద ఉచ్చారణా ప్రక్రియనంతా " ఓం " కారం తెలియజేస్తూంది. అందువలన " ఓం " కారాన్ని భగవత్ రూపంగా స్వీకరించడము జరిగింది

సాధన సాధ్యతే సర్వం

"ఓం"కారాన్ని మించిన మంత్రం లేదంటారు.

''ఓం'' అంటూ ఉచ్చరించే ఓంకారం పరమ పవిత్రమైంది. ప్రణవ స్వరూపం, ఓంకారం శివరూప తత్వం.

మహాశివుడు డమరుకం మోగిస్తున్నప్పుడు ఆ ధ్వనిలోంచి అక్షరాలు వచ్చాయట.

మహా మహిమాన్వితమైన ఓంకారానికి అనేక అర్ధాలు ఉన్నాయంటూ నిర్వచించారు.

ప్రధానంగా 18 అర్ధాలను సూచించారు.

ఓంకారం తేజోవంతమైంది. సర్వలోకానికీ వెలుగునిస్తుంది.

ప్రేమైక తత్వాన్ని ఇస్తుంది.

ఓంకారం ప్రశాంతతని, ఆనందాన్ని, సంతృప్తిని ప్రసాదిస్తుంది.

గ్రహణశక్తిని పెంచి, అనేక అంశాలను అవగాహన చేసుకునే అవకాశం కలిగిస్తుంది.

ఓంకారం నిత్యజీవితంలో కలిగే కష్టనష్టాల నుండి రక్షిస్తుంది.

సృష్టిలో సూక్ష్మ ప్రాకృతిక అంశాలను స్థూల మార్గంలోకి తెస్తుంది.

ఓంకారం సూక్ష్మరూపంలో ప్రాణకోటిలో ప్రవేశిస్తుంది.

ప్రళయకాలంలో జగత్తును తనలో లీనం చేసుకుంటుంది.

ఓంకారం స్థూల, సూక్ష్మ, గుప్త, శబ్దనిశ్శబ్దాలను గ్రహిస్తుంది.

ప్రబోధాత్మకమైన బుద్ధిని ప్రసాదిస్తుంది.

ఓంకారం చరాచర జగత్తును శాసిస్తుంది అజ్ఞానాన్ని, అంధకారాన్ని నశింపచేస్తుంది.

ఓం ఓమ్ కారం

ఓంకారం విద్యను, వివేకాన్ని, జ్ఞానాన్ని, తేజస్సునూ ఇస్తుంది.

సర్వ ఐశ్వర్యాలనూ కల్పిస్తుంది.

ఓంకారం శుద్ధ అంతఃకరణను ప్రసాదిస్తుంది.

సర్వ వ్యాపితం.

ఓంకారం సమస్త జగత్తుకూ నాయకత్వం వహిస్తుంది.

కోరికలకు దూరంగా ఉంటూ, అందరి శ్రేయస్సూ కోరుకోవాలని ఉపదేశిస్తుంది.కారం విద్యను, వివేకాన్ని, జ్ఞానాన్ని, తేజస్సునూ ఇస్తుంది.

సర్వ ఐశ్వర్యాలనూ కల్పిస్తుంది.

ఓంకారం శుద్ధ అంతఃకరణను ప్రసాదిస్తుంది.

సర్వ వ్యాపితం.

ఓంకారం సమస్త జగత్తుకూ నాయకత్వం వహిస్తుంది.

కోరికలకు దూరంగా ఉంటూ, అందరి శ్రేయస్సూ కోరుకోవాలని ఉపదేశిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)