బంకించంద్ర ఛటోపాధ్యాయ

Telugu Lo Computer
0

బంకించంద్ర 'ఛటోపాధ్యాయ' ( ఛటోపాధ్యాయ ) ను బ్రిటిష్ వారు పలకలేక 'ఛటర్జీ'అనిపిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచం కూడా 'ఛటర్జీ' అని పిలవడం ప్రారంభించింది. ఇతను బెంగాలీ కవి, వ్యాసరచయిత మరియు సంపాదకుడు. ఇతని రచన వందేమాతరం ఇతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది.
ఇతను వ్రాసిన ఆనంద్ మఠ్ అనే నవలనుండి వందేమాతరం గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది.
ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర చటర్జీ అగ్రగణ్యుడు.ఒక్క బెంగలీ సాహిత్యాన్నే కాక సమస్త భారతీయ సాహిత్యాలను ఆయన పంతొమిదోశతాబ్దిఉత్తరార్దంలో,ఇరవయ్యోపూర్వార్దంలో అంటె సుమారు ఒక శతాబ్దం పాటు ప్రభావితం చెసాడు.
పూర్వకాలంలో కాని, ఇటీవల కాలంలో కాని ప్రపంచ సాహిత్య చరిత్రలో జాతుల విముక్తి పోరాటాలలో,స్వాతంత్ర్య సమర చరిత్రలో ఒక మహా కవి రచించిన దేశభక్తి గీతం తన జాతి జనులను ఉత్తేజపరిచి,ఉద్యమింపచేసిన సంఘటన,బంకించంద్రుడి విషయంలో లాగ మరొక దేశంలో, మరొక దేశ స్వతత్ర్యోద్యమంలో సంభవించలేదు.
బారతదేశస్వతత్ర్యోద్యమం ఒక నిర్ణాయక ఫలసిద్ధి దిశగాచైతన్యవంతమవుతున్నప్పుడు వందేమాతరం గీతం దాని వేగాన్ని త్వరితం చేసింది వంగదేశంలో కొందరు సాహిత్య విమర్శకులు,ఆధునిక కాలంలో బకించంద్రుడి వంటి నవలా రచయిత ఇంకొకరు లేరంటారు.ఆయన సృష్టించిన పాత్రలు కాల్పనిక సాహిత్యనికి చెందినవే ఆయినా సృజనాత్మక సంవేదనలలో ఆయనకాయనే సాటి అని
ఆసాహిత్య విమర్శకులఅభిప్రాయం.ఆయన సాహిత్య ప్రతిభ బహుముఖమైనది.
నవలలు,వ్యాసరచన,సాహిత్యవిమర్శ,వ్యాఖ్యానరచనలో బంకించంద్రచటర్జీ వంగ సాహిత్యంలో కొత్త ఒరవడి సృష్టించాడు.నవలా రచనలో తక్కిన ఆధునిక భారతీయ సాహిత్యాలకు కూడా ఆయనే దారిచూపాడు.
అంతరాంతరాలలో ఆయనకు పురా భారతీయ సంస్కృతిపట్ల,హిందూమతాచార విశ్వాసాల పట్ల అభిమానం ఉండేదని కొందరు సాహిత్యవేత్తల
అభిప్రాయం.యూరొపుమేదావులు,సాహిత్యవేత్తలు భారతీయ తత్త్వ చింతనను సరిగా అర్థం చేసుకోలేదని వారిపట్ల ఆయనకు ఒక అభియోగం ఉండేదని కొందరు బెంగాలీ సాహిత్య విమర్శకులు భావిస్తారు.
ఏది ఏమైనా
బంకించంద్ర చటర్జీ(1838-1894),
రబీంద్రనాథ్ ఠాగూర్(1861-1941),
శరత్చంద్ర చటర్జీ(1876-1938) 20వ శతాబ్దంలో వంగ సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేశారని అజిత్ కుమార్ అనే సాహితీవేత్త అభిప్రాయం.
బంకించంద్రచటర్జీరచనలుఉదాత్తఆదర్శాలకు,
రవీంద్రుడి రచనలు కాల్పనిక సౌందర్య తాత్త్వికతకు,శరత్ రచనలు సమాజ వాస్తవికతకు దర్పణాలని ఆయన అంటారు.
మానవుడు చేరుకోగల ఉదాత్తశిఖరాలను
బంకించంద్రుడి పాత్రలుఅధిరోహిస్తాయి.
ఉదారాశయాలు,ఉజ్జ్వలభావాలు,ధీరోధాత్తసాహసం,ప్రణయం,శృంగారం,ఆయన తన నవలలలో చిత్రించాడు.అనూహ్యమైన,మానవాతీతమైన త్యాగాన్ని అయన పాత్రలు ప్రకటిస్తాయి.
బంకించంద్రుడిలో మాతృదేశాభిమానం ఆరాధన అపూర్వం. ఆనందమఠం లో ఆయన చిత్రించిన పాత్రలు ఎటువంటి త్యాగానికైనా, సాహసానికైనా వెనుదీయని ప్రతీకలు. ఫురాభారతీయ వాజ్ఞ్మయంలో ధర్మప్రతిష్ఠాపన, నీతి, ఆదర్శమూ, సత్యమూ, అనుపాలించే పురాణ పాత్రలలాగ బంకించంద్రుడి కాల్పనిక, వీర శృంగార, ఐతిహాసిక నవలల్లో ఆయన సృష్టించిన పాత్రలు పాఠకులను సమ్మోహితులని చేసి ఆకర్షిస్తాయి. అట్లా అని ఆపాత్రలు జీవ ఛైతన్యాన్ని, వాస్తవిక మూర్తిమత్వాన్ని విస్మరించవు. బహుశా అటువంటి పాత్రలను సృష్టించడానికి ఆయన ఎందుకు పూనుకున్నాడంటే ఆయన సమకాలీన సమాజంలో అటువంటి భావోద్విగ్నతలు కల రచనలే ఆయనకు కనపడలేదు కనుక. అటువంటి సృజనాత్మక చిత్రణ కూడా లేదు. అందువల్ల ఆయన చారిత్రిక పాత్రలను, పూర్వ చారిత్రిక వైభవ సన్నివేశాలను, సౌందర్య భావుకతను,భావుకతా సౌందర్యాన్నీ ఆలంబనం చేసుకొని రచనలు చేశాడని కొందరు సాహితీవేత్తలంటారు.
ఆయన స్త్రీ పాత్రలు సంప్రదాయ జీవిత శృంఖలాల మధ్య నిరాశోపహతంగా జీవించవు. సాహసం, నిర్భీకత, ప్రణయోద్వేగం, మానవానుభూతులు, శృంఖలవిఛ్ఛేధం, జీవన సహజాత ఉధృతుల మధ్య అవి జీవిస్తాయి. అటువంటి స్త్రీ పాత్రలు పురుషులకే మాత్రం తీసిపోరు అని వంగ సాహిత్య విశ్లేషకులు, విమర్శకులు, బంకించంద్ర ఛటోపాధ్యాయను ప్రశంసించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)