కరోనా తగ్గిన తరువాత....!

Telugu Lo Computer
0


కోవిడ్ - 19 నుండి కోలుకోవడం ఒక ఎత్తు అయితే, దాని తరువాత వచ్చే సమస్యలు మరొక ఎత్తు.  హమ్మయ్య.. !  కరోనా నుండి బయట పడ్డాములే అనే సంతోషం కొద్ది రోజులు కూడా ఉండదు.  ఆస్పత్రి ఖర్చులు, మందులకు అయ్యే ఖర్చులతో ఆర్థికంగా చాలా దెబ్బతిని ఉంటాం. అప్పుల పాలవుతాం.  అప్పులు ఏదో విధంగా తీర్చుకుందాం అని ధైర్యం చేద్దామనుకుంటే, పని చేయడానికి శరీరం సహకరించదు.  కోవిడ్ - 19 చికిత్సకు ఉపయోగించిన స్టెరాయిడ్ల వల్ల శరీరం దాదాపు దెబ్బతిని పోతుంది.  ఎక్కువ పని చేయలేము.  కొంచెం కష్టపడగానే నీరసం, నిస్సత్తువ వస్తాయి.  ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇంతకు ముందు లాగా ఉండవు. తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. వీటితో మరలా ఆరోగ్యానికి ఏమవుతుందో అనే ఆందోళన పెరుగుతూ ఉంటుంది. రాత్రి పూట సరిగా నిద్ర పట్టదు. జ్నాపక  శక్తి తగ్గిపోతుంది. ఒత్తిడి (స్ట్రెస్)గా ఉంటుంది. వీటితో మానసిక కుంగుబాటు (డిప్రెషన్) సమస్యలు కూడా మొదలవుతాయి. బలవర్ధక ఆహారం తీసుకోమంటారు. కాని, ఆర్థిక సమస్యల కారణంగా సరైన తిండి తినలేము.  తినకపోతే రోగ నిరోధక శక్తి ఉండదు.  అటు ఆరోగ్యం సహకరించక, ఇటు ఆర్థికంగా దెబ్బతినడం, మానసికంగా కుండిపోవడం  వలన నరకం అనుభవించాల్సి వస్తుంది.  

కాబట్టి కరోనా నుండి కోలుకున్న వారికి కూడా  బయటి నుండి సహకారం అవసరమవుతుంది. ప్రభుత్వాలు  వీరికి ఆర్థికంగా సహాయం అందించి, ఆదుకోవాలి.  ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన కుటుంబాలను నిలబెట్టాలి.




Post a Comment

0Comments

Post a Comment (0)