ధర తగ్గనున్న ఎలెక్ట్రికల్ టూ వీలర్ !

Telugu Lo Computer
0


రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలను ప్రోత్సహించే దిశగా సబ్సిడీ స్కీమ్‌ FAME II స్కీమ్‌లో కేంద్రం సవరణ చేసింది. ఈ సవరణ కింద ఎలక్ట్రానిక్ టూవీలర్లపై భారీగా రాయితీలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లపై ఇదివరకు సబ్సిడీ రేటు ఒక KWhకు రూ.5 వేలు నుంచి ఉండేది. ఇప్పుడు ఈ సబ్సిడీని రూ.15 వేలుకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ISE వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఖరీదైనవే.. ఎలక్ట్రానిక్ వాహనాల ధర రూ.20 వేలు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాలపై సబ్సిడీని పెంచింది. ఈ బైకుల ధరలు తగ్గడం ద్వారా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ టూవీలర్ల వినియోగం పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోనే తొలి ఈవీ మేకర్, బెంగళూరు ఆధారిత తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ సబ్సిడీ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)