99% వైరల్ లోడ్ తగ్గించే నాజల్ స్ప్రే!

Telugu Lo Computer
0


కెనడాకు చెందిన బయోటెక్ కంపెనీ ‘శానో‌టైజ్  రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ ముక్కులో స్ప్రే చేసే  నైట్రిక్ నాసల్ స్ప్రే (ఎన్ఓఎన్ఎస్)ను తయారుచేసింది. కరోనా బాధితుల్లో వైరల్ లోడును ఇది 99 శాతం తగ్గిస్తుందని పేర్కొంది. ఎగువ శ్వాసనాళాల్లోని వైరస్‌ను ఈ నాజల్ స్ప్రే చంపేస్తుందని పేర్కొంది.  శ్వాస నాళాలలో పాగా వేసే వైరస్ ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుందని, తాము అభివృద్ది చేసిన ఈ నాసల్ స్ప్రే అక్కడున్న వైరస్‌ను సమూలంగా నిర్మూలిస్తుందని ఆ సంస్థ తెలిపింది. కరోనా  బారినపడిన 79 మందిపై ఈ స్ప్రేను పరీక్షించగా 24 గంటల్లోనే 95 శాతం వైరల్ లోడు తగ్గినట్టు గుర్తించారు.72 గంటల్లో 99 శాతం మేర వైరల్ లోడును తగ్గించింది. బ్రిటన్ వేరియంట్‌పైనా ఇది సమర్థంగా పనిచేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఔషధం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని పేర్కొన్నారు. ఈ ఔషధాన్ని భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు శానోటైజ్ సంస్థ సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఎన్ఓఎన్ఎస్ కు ఇజ్రాయెల్, న్యూజిలాండ్ ప్రభుత్వాలు ఇటీవలే వినియోగానికి పచ్చ జెండా ఊపాయి

Post a Comment

0Comments

Post a Comment (0)