తిరుపతిలో పులివర్తి నానిపై దాడి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి టిడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతిలో దాడి జరిగింది. పద్మావతి విశ్వవిద్యాలయంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను ఆయన సందర్శించి తిరగి వస్తుండగా, అధికార వైకాపా కార్యకర్తలు ఈ దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన స్పృహతప్పి పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని పోటీ చేయగా, వైకాపా నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేశారు. అయితే, తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. ఆ తర్వాత ఆయన తిరిగి వెళుతుండగా వైకాపా కార్యకర్తు దాడికి పాల్పడినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. పులివర్తి నాని స్పృహతప్పి పడిపోయారు. దాడిలో పులివర్తి నాని కారును ధ్వంసం అయింది. కాగా ఈ దాడిని నిరసిస్తూ నాని, ఆయన అనుచరులు పద్మావతి వర్శిటీ రోడ్డుపై బైఠాయించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)