తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు !

Telugu Lo Computer
0


తెలంగాణలో పోలింగ్ సమయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషను పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించింది. ఎండల తీవ్రత దృష్ట్యా రాజకీయ పార్టీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. మే 13న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. కాగా, అంతకుముందు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)