తాడేపల్లిలో పెద్ద సైకో - గన్నవరంలో పిల్ల సైకో !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ తాడేపల్లిలో పెద్ద సైకో.. గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ సభకి వర్షం ఆటంకం కలిగించినప్పటికీ కూడా చంద్రబాబు వర్షంలోనే మాట్లాడుతూ రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తామని వార్నింగ్ ఇచ్చారు. గన్నవరం టీడీపీకి కంచుకోట, 9 సార్లు ఎన్నికలు జరిగితే ఇండిపెండెంట్‌తో కలిపి 8 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందన్నారు. అమెరికాలో పనిచేసిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు.. ప్రజలకు సేవ చేసేందుకే ఆయన గన్నవరం నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు.ఎంపీ అభ్యర్థి బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు నాయుడు ఓటర్లను కోరారు. ”నవరత్నాల పేరుతో జగన్‌ మోసం చేశారు అని మండిపడ్డారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు తరలి రావడంతో గన్నవరం జనసంద్రంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)