ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి భోజన ఏర్పాట్లు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఎన్నికల కమిషన్ భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేసింది. పోలింగ్ ముందురోజున కేంద్రానికి చేరినప్పటి నుంచి పోలింగ్ రోజున సాయంత్రం పోలింగ్ ముగిసే వరకూ ప్రత్యేక మెనూ ఏర్పాటు చేశారు. 12వ తేదీ సాయంత్రం పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరుకోగానే వారికి బొండాలు, గారెలు అల్పాహారం, మజ్జిగ లేదా టీ ఇవ్వాలి. రాత్రి 7.30 గంటలకు చపాతి లేదా రోటీ, అన్నం, ఆకుకూర పప్పు, పచ్చడి, ఆలూటమాట కూర, రసం, పెరుగు, వడియాలు, అరటిపండుతో భోజనం ఉండాలి. పోలింగ్ రోజు 13వ తేదీ ఉదయం 4.30 గంటలకు టీ, 5 గంటలకు వేడి ఇడ్ల్లి, గారె, రెండురకాల చెట్నీలతో అందించాలి. 9 గంటలకు ప్రూట్స్, మజ్జిగ లేదా కొబ్బరినీరు, 11 గంటలకు కేకు, టీ, మధ్యాహ్నం 12.30 గంటలకు విజిటబుల్ బిర్యాని, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, 3 గంటలకు ఉస్మానియా బిస్కెట్లు, టీ లేదా ఫ్రూట్సలాడ్, సాయంత్రం 6 గంటలకు బొండా, గారి, చెట్నీ, టీ, మజ్జిగ ఇస్తారు. ఇవన్నీ స్థానికంగా తయారు చేయించి, వేడివేడి ఆహారపదార్థాలను ఫ్రెష్గా వడ్డించాలని సంభందిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 15 మంది సిబ్బంది చొప్పున మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందించాలని ఆదేశించారు

Post a Comment

0Comments

Post a Comment (0)