పేలి గాల్లోకి ఎగిరిన వ్యాన్ !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని బులంద్షహర్ జిల్లా ఖాన్పూర్ ప్రాంతంలో పార్క్ చేసిన మారుతీ వ్యాన్లో మంటలు చెలరేగాయి. సుమారు 20 నిమిషాలపాటు ఆ వాహనం కాలిపోయింది. అనంతరం పెట్రోల్ ట్యాంకు పెద్ద శబ్దంతో పేలడంతో ఆ వ్యాన్ గాల్లోకి ఎగిరి పడింది. కాగా, ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే ఆ వ్యాన్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినిమాలో మాదిరిగా మంటల్లో కాలిన వ్యాన్ గాల్లోకి ఎగురడం చూసి నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. కాగా, వేసవి కాలంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారులు సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)