తెలంగాణ టూరిజం తిరుమల ఒక్కరోజు టూర్ ప్యాకేజీ !

Telugu Lo Computer
0


తెలంగాణ టూరిజం తిరుమలకు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ కేవలం ఒక రోజులో పూర్తవుతుంది. బస్సులో ప్రయాణానికి  పెద్దలకు 3700 రూపాయలు., పిల్లలకు 2960 రూపాయలు. ఈ ప్యాకేజీలో తిరుమలలో ఉచితంగా శ్రీవారి శీఘ్ర దర్శనం కూడా ఉంటుంది. తిరుపతి-తిరుమల టూర్ పేరుతో తెలంగాణ టూరిజం ఓ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుండి బస్సులో తిరుపతి, తిరుమల, తిరుచానూరు కేవలం ఒక్కరోజులో కవర్‌ చేసేలా ఇందులో ప్లాన్ చేసారు. ఈ ప్యాకేజీలో  మొదటి రోజు బస్సు హైదరాబాద్ నుండి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుమల చేరుకుంటారు. రిఫ్రెష్ అయిన తర్వాత, అక్కడ ఉన్న దేవాలయాలను చూస్తారు. అనంతరం తిరుమలలో శ్రీవారి శీఘ్ర దర్శనం ఉచితంగా ఉంటుంది. దర్శనం తర్వాత తిరుపతి చేరుకుంటారు. తిరుగు ప్రయాణం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. తెలంగాణ టూరిజం టిక్కెట్లను బుక్ చేసుకున్న యాత్రికులందరూ తప్పనిసరిగా తెలంగాణ టూరిజం బస్సులో మాత్రమే ప్రయాణించాలి. తమ కార్లలో వచ్చి దర్శన టిక్కెట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తే మాత్రం టీటీడీ అధికారులు అందుకు ఒప్పుకోరు. అంతేకాదు మీ డబ్బులు కూడా తిరిగి ఇవ్వబడవు. 

Post a Comment

0Comments

Post a Comment (0)