రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో తొమ్మిది మంది సిబ్బంది అరెస్ట్ !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో అవినీతికి పాల్పడుతున్న తొమ్మిది మంది సిబ్బందిని సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. ఇద్దరు వైద్యులతోపాటు సీనియర్ ల్యాబ్ ఇన్‌చార్జ్ ఉన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచే కాకుండా మెడికల్ రిప్రజెంటేటివ్స్ వద్ద నుంచి వీరు భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ జరిపిన సీబీఐ వారిని అరెస్ట్ చేసింది. వారిలో.. కార్డియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పర్వత గౌడతోపాటు కార్డియాలజీ విభాగంలోని ప్రొఫెసర్ డాక్టర్ అజయ్ రాజ్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. అలాగే సీనియర్ ల్యాబ్ ఇన్‌చార్జీ రజనీష్ కుమార్‌ సైతం అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. రామ్‌ మనోహర్ లోహియా ఆసుపత్రిలో సిబ్బంది లంచాలను డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అందులోభాగంగా.. గుండెకు వేసే స్టంట్స్‌తోపాటు వైద్యానికి అవసరమైన పరికరాలు, గుండెకు వేసే స్టంట్స్‌లో నిర్దిష్ట బ్రాండులే కావాలని డిమాండ్ చేయడం.. ల్యాబ్స్‌లో వైద్య పరికరాలు, ఇక ఆసుపత్రిలో చేరిన రోగుల నుంచి లంచాల రూపంలో నగదు వసుల్ చేయడం.. అలాగే నకిలీ వైద్య దృవపత్రాలను జారీ చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. అందులో ప్రమేయమున్న 9 మంది సిబ్బందిని సీబీఐ అరెస్ట్ చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)