వివేకా హత్య కేసులో అవినాశ్ నిర్దోషి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రిలేషన్స్‌లో రాజకీయాలు చొరబడితే కుటుంబాల్లో కలతలు వస్తాయని, కుట్ర కోణంలో ఉండే చంద్రబాబు ఆ వివాదాన్ని మరింత రెచ్చగొట్టారని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సవాళ్లు వస్తాయని స్పష్టం చేశారు. ఒక స్థాయి వరకు గొడవను సర్దుబాటు చేయవచ్చని, అది శృతి మించితే ఏం చేయలేమని జగన్‌ అన్నారు. కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇస్తే బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు తప్పవన్నారు. ఎన్నికలయ్యాక షర్మిల స్టాండ్‌ ఏంటో తెలుస్తుందన్నారు. తాను ముఖ్యమంత్రి అయింది కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేయటానికి కాదన్నారు. చంద్రబాబు, రేవంత్ ఏపీలోకాంగ్రెస్ ను ఆపరేట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్‌కు రాలేదన్న జగన్, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని సవాళ్లు వస్తాయన్నారు. మనం తీసుకునే సిద్దాంతాలు మన క్యారెక్టర్‌ను నిర్వచిస్తాయన్నారు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా పాలన చేస్తున్నా, తన ఫొటో ప్రతి ఇంట్లో ఉండాలనేలా, తాను చనిపోయినా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండాలనుకుంటానని అన్నారు. ఒకే కుటుంబం నుంచి ఒకే తరం వాళ్లు రావడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. వైసీపీపై కోట్ల మంది ఆధారపడి ఉన్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అంతా మంచే చేసినప్పుడు వైనాట్ 175 అని జగన్ ప్రశ్నించారు. అందరితో సత్సంబంధాలు ఉండాలని తాను ఆశిస్తానన్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణ పైన తనకు ఆసక్తి లేదన్నారు. పవన్ కల్యాణ్ మూడు వివాహాల గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. వివేకా హత్య ఎవరు చేసారో కడప ప్రజలందరికీ తెలుసన్నారు. అవినాశ్ తప్పు చేయలేదని ఆ తరువాత తాను పలు సందర్భాల్లో చెప్పిన వివరణతో తాను ఏకీభవిస్తున్నానని వివరించారు. సీబీఐ విచారణ చేపట్టిన తరువాత కొందరు నేతలు ప్రభావితం చేసారని ఆరోపించారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తామని, విశాఖలోనే తన ప్రమాణ స్వీకారం ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)