కేసీఆర్ రోడ్ షోలు తెలంగాణ ఉద్యమ రోజుల్ని మళ్లీ గుర్తు చేశాయి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని సిద్దిపేటలో తన నివాసంలో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోలు నాటి తెలంగాణ ఉద్యమ రోజుల్ని గుర్తు చేశాయన్నారు.  కేసీఆర్ సభలు విజయవంతమైన తీరు తమకు గెలుపు విశ్వాసాన్ని ఇస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ సభలకు అంత స్పందన లేదని అన్నారు. అమిత్ షా సభకు జనాలు లేక ఏడు నిమిషాల్లో ముగించారని తెలిపారు. సరూర్ నగర్ లో రాహుల్ గాంధీ సభకు అదే పరిస్థితి ఎదురైందని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ గ్యారంటీ ల వైఫల్యంపై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ కు శిక్ష వేయాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బోగస్ సర్వేలతో తమ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశాని హరీశ్ రావు అన్నారు. ఈ రెండు రోజులు బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తారని, జాగ్రత్తగా ఉండాలని కోరారు. రిజర్వేషన్లపై గొంతు చించుకుంటున్న రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ లో ఎందుకు రిజర్వేషన్ పాటించలేదని హరీశ్ రావు నిలదీశారు. మంత్రి వర్గంలో, ఎంపీ టికెట్లలో కాంగ్రెస్ బీసీ, ఎస్సీ, మైనార్టీలకు అన్యాయం చేసిందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)