తెలంగాణతో తనకు ప్రత్యేక అనుబంధం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని తాండూరు జనజాతర సభలో ప్రియాంక గాంధీ శనివారం పాల్గొని మాట్లాడుతూ తెలంగాణతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. ఇందిరాగాంధీని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ తర్వాత సోనియమ్మపై ఇక్కడి ప్రజలు అభిమానం చూపించారని తెలిపారు. దేశ ప్రజలు చెప్పే సమస్యలు వినడానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కాంగ్రెస్ నేతలు భావిస్తారన్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలని దేశంలో ప్రయత్నం జరుగుతోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదలను ఆదుకునే పథకాలేమీ ఉండవన్నారు. యూపీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 ఉందని, రూ.1200 గ్యాస్ సిలిండర్ ను తెలంగాణలో రూ.500లకే ఇస్తున్నారన్నారు. రైతులు, నిరుపేదలు, మహిళల కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయదన్నారు. బీజేపీ పాలనలో పేదలపై వేసే పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయన్నారు. పేద రైతులు రూ.50 వేలు, రూ.లక్షల రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పేద రైతులకు రుణమాఫీ చేసేందుకు బీజేపీ సర్కారు అంగీకరించదన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)