కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు !

Telugu Lo Computer
0


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కి జూన్‌ 1 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకొకసారి మాత్రమే జరుగుతున్నందున పరిస్థితి "అసాధారణమైనది" అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ముఖ్యమంత్రి తన అధికార విధులను నిర్వర్తించడం లేదా ఫైళ్లపై సంతకం చేయకూడదని ధర్మాసనం పేర్కొంది. జూన్‌ 2న తిరిగి జైలు అధికారులకు లొంగిపోవాని తెలిపింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మార్చి 21న ఇడి కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)