చంద్రబాబు, లోకేశ్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ వారిపై ఎన్నికల కమీషన్‌ సీరియస్‌ అయింది. ఫేక్‌ ప్రచారం చేసినందుకు గాను వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో ఏపీ సీఐడీ చంద్రబాబు, లోకేశ్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబును ఏ1గా, లోకేశ్‌ను ఏ2గా సీఐడీ చేర్చింది. కాగా, 2023లో తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఆ చట్టంతో భూములు పోతాయని, మొత్తం భూమి ప్రభుత్వం లాకేసుకుంటుందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)