గర్భిణిపై వైకాపా నాయకుల దాడి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుందన్న కోపంతో ఎనిమిది నెలల గర్భిణిపై వైకాపా నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. తంబళ్లపల్లి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో వేపుడుకోట పంచాయతీ కోటకోళ్లపల్లెకు చెందిన మల్లికార్జున, ఆయన భార్య కల్యాణి గ్రామ సమస్యలపై ఆమెతో మాట్లాడారు. గ్రామానికి ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నాయకులు కల్యాణి గర్భిణి అని కూడా చూడకుండా కాళ్లతో తన్ని విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన భర్త మల్లికార్జునను సైతం చితకబాదారు. గాయపడిన దంపతులను 108 వాహనంలో మదనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)