పేదలకు సంక్షేమాన్ని ఆపడం ధర్మం కాదు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో పేదలకు సంక్షేమాన్ని ఆపడం ధర్మం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ విపక్షాలకు సూచించారు. చంద్రబాబు కుట్రలకు ఈసీ వంతపాడటం అన్యాయం అన్నారు. ఈసీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు ఈ నిబంధనలు అడ్డురాలేదా? అని బొత్స ప్రశ్నించారు. కూటమిలో ఉంటే ఒక మాట..లేకపోతే మరో మాటా అని అడిగారు. పేదవాడికి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లకూడదనే కూటమి కుట్ర అని బొత్స ఆరోపించారు.పొరపాటున కూటమి గెలిస్తే ఈ రాష్ట్రంలో ఇక పేదవాడు బతుకుతాడా? అని బొత్స ప్రశ్నించారు. బాబును దేవుడు కూడా క్షమించడన్నారు. చంద్రబాబు ప్రకటనలపై స్పందిస్తూ.. కడుపుకు అన్నం తినే ఏ నాయకుడైనా అలాంటి ప్రకటనలు ఇస్తాడా అని బొత్స నిలదీశారు. ఎన్నికల కమిషన్‌ మీ భూమి మీది కాదన్న ప్రకటనకు ఏం సమాధానం చెప్తుందని బొత్స సూటిగా ప్రశ్నించారు. అలాగే తన ఇంట్లో వారికి మూడు సీట్లు ఇవ్వడంపై స్పందిస్తూ.. నీ ఇంట్లో నాలుగు పదవులు లేవా చంద్రబాబూ అని అడిగారు. ఏ ఎండకు ఆ గొడుకు పట్టుకునే బతుకు నీదే అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ కొడుకునే గెలిపించుకోలేకపోయారంటూ బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే నేను ఎంపీగా గెలిచానన్నారు. మీ పనైపోయిందో..నా పనైపోయిందో జూన్‌ 4 నాడు తెలుస్తుందన్నారు. నగదు బదిలీ నిధుల విడుదలపై కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నా.. ఇవాళ ఉదయం నుంచీ తీవ్ర పరిణామాలుంటాయంటూ అధికారుల్ని బెదిరించారంటూ బొత్స ఆరోపించారు. ఇప్పుడే పేదవాళ్లని ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే పొరపాటున కూటమి గెలిస్తే ఈ రాష్ట్రంలో ఇక పేదవాడు బతుకుతాడా అని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వాలపై ఆధారపడుతున్న పేద జీవితాలు కష్టాలతోనే కొనసాగించగలరా అని అడిగారు. రాష్ట్ర ప్రజలారా...వీరు ఎంత నీచంగా ఆలోచన చేస్తున్నారో ఒక సారి గుర్తించాలన్నారు. రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థుల పట్ల వీళ్లకి ప్రేమే లేదన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)