చెత్తకుప్పలో భద్రాద్రి రాముడి లడ్డూలు?

Telugu Lo Computer
0


'అన్నదాన సత్రం వెనుక పెంటకుప్పలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం లడ్డూలు' అంటూ మంగళవారం సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్​అయ్యాయి. 'అంతా రామమయం.. ఆలయ అధికారుల తీరంతా అయోమయం' అంటూ ఆ ఫొటోలకు ట్యాగ్​లైన్ ​పెట్టారు. దీంతో ఇది చూసిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, శ్రీరామనవమి సందర్భంగా అన్నదాన సత్రం సమీపంలో కొందరు నకిలీ లడ్డూలను తయారు చేసి అమ్ముతున్నారన్న సమాచారంతో వాటిని దేవస్థానం అధికారులు పట్టుకున్నారు. వాటిని బయోగ్యాస్​కు వినియోగించేందుకు పక్కన బెట్టారు. అందులో కొన్నింటిని బయట పడేయడంతో కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అవి పట్టుకున్న లడ్డూలు అంటూ దేవస్థానం ఈఈ రవీందర్​వివరణ ఇవ్వాల్సి వచ్చింది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి కనీసం వాటిని నదిలో నిమజ్జనం చేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు.


Post a Comment

0Comments

Post a Comment (0)