ఫిన్లాండ్ కాల్పులకు తెగబడిన మైనర్ బాలుడు !

Telugu Lo Computer
0


ఫిన్లాండ్ లోని పాఠశాలలో ఓ మైనర్ బాలుడు కాల్పులకు తెగబడిన ఘటనలో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన మైనర్ ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. హెల్సింకిలోని వాన్టా పాఠశాలలో మంగళవారం ఉదయం 10.00 గంటల  సమయంలో 12 ఏళ్ల విద్యార్థి కాల్పులు ప్రారంభించాడు. ఆ సమయంలో పాఠశాలలో 90 మంది పాఠశాల సిబ్బంది సహా 800 మంది చిన్నారులు ఉన్నారు. ఒకటి నుండి తొమ్మిది తరగతుల విద్యార్థులు హాజరయ్యారని, వీరంతా ఏడు నుండి 15 సంవత్సరాల వయస్సులోపు వారని అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పాఠశాలకు చేరుకుని, కాల్పులకు పాల్పడిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన షాకింగ్కు గురిచేసిందని ఫిన్లాండ్ అంతర్గత వ్యవహారాల మంత్రి మారి తెలిపారు. ఈ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల బాధ, ఆందోళనను తాను అర్థం చేసుకోగలనని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)