సౌత్‌ ఇండియన్‌ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్‌ !

Telugu Lo Computer
0


టాటా మోటార్స్‌ వాణిజ్య వాహన వినియోగదార్లు, డీలర్‌షిప్‌లకు ఫైనాన్సింగ్‌ సొల్యూషన్స్‌ అందించడానికి ప్రైవేట్‌ బ్యాంకు సౌత్‌ ఇండియన్‌ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. తమ సంస్థ వ్యాపార లక్ష్యాలను సాధించడానికి అనేక వాణిజ్య వాహనాలను నిర్వహించే యజమానులు, డీలర్‌షిప్‌లను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని టాటా మోటార్స్‌ తెలిపింది. టాటా మోటార్స్‌ 1 టన్ను నుంచి 55 టన్నుల కార్గో (చిన్న, పెద్ద వాణిజ్య వాహనాలను), 10 సీట్ల నుంచి 51 సీట్ల ప్యాసింజర్‌ వాహనాలు, బస్సులను విక్రయిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)