దిలీప్‌ ఘోష్‌, సుప్రియా శ్రీనేత్‌ లకు ఈసీ చీవాట్లు !

Telugu Lo Computer
0


బిజెపి ఎంపి దిలీప్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌లను హెచ్చరిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల బిజెపి ఎంపి దిలీప్‌ ఘోష్‌ మమతాబెనర్జీపై, కంగనా రనౌత్‌ పై కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌ అమర్యాదకర వ్యాఖ్యలు చేశారు. దీంతో వ్యక్తిగత దూషణలకు దిగినందుకు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఇసి ఆ ఇద్దరికీ నోటీసులు పంపింది. అందుకు వారిచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని ఈసీ చీవాట్లు పెట్టింది. ఎన్నికల నియమావళి ముగిసేవరకు ప్రజల మధ్య మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని దిలీప్‌, సుప్రియాలను ఈసీ హెచ్చరించింది. ఆ ఇద్దరి ఎన్నికల సంబంధ వ్యవహారాలను ఇప్పటి నుంచి తాము స్వయంగా ప్రత్యేకించి పర్యవేక్షిస్తామని తన ఆదేశాల్లో పేర్కొంది. మళ్లీ ఇలాంటి తప్పులే పునరావృతమైతే కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)