నంద్యాల జిల్లాలో డిజిటల్ పేమెంట్స్ ఉంటేనే మద్యం ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేళ నంద్యాల జిల్లా ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్ శ్రీనివాసులు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. మద్యం దుకాణాల్లో కేవలం డిజిటల్ చెల్లింపులు మాత్రమే చేయాలని స్పష్టం చేశారు. ఫోన్ పే, గూగుల్ పే, డిజిటల్ పేమెంట్స్ ఉంటేనే మద్యం ఇవ్వాలని మద్యం దుకాణాల యజమానులకు వెల్లడించారు. దీంతో మద్యం షాపుల వద్ద ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తేనే అమ్మకాలని బోర్డులు వెలిశాయి. ఫోన్ పే, గూగుల్ పే, డిజిటల్ పేమెంట్స్ చేయలేని మందు బాబు దుకాణానికి వచ్చి బోర్డు చూసి వెనుదిరుగుతున్నారు. మందు బాబులు ఆన్ లైన్ పేమెంట్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రోజు వారి కూలీలు చేసుకునే కొందరితో మొబైల్స్ ఉండవని.. ఆన్ లైన్ పేమెంట్ ఎలా చేయాలని వాపోతున్నారు. దీంతో ఉదయం నుంచి మద్యం అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. కొందరూ మందుబాబులు మద్యం షాపుల నిర్వాహకులతో వాగ్వాదానికి దిగుతున్నారు. క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. అధికారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)