నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిని మార్చాలి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని నల్లగొండ ఎంపీ టికెట్‌ శానంపూడి సైదిరెడ్డికి కేటాయించడంపై స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఏది ఏమైనా సైదిరెడ్డిని మార్చాలని జిల్లా నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. ఈ మేరకు జిల్లా బీజేపీ నేతలు పార్టీ పెద్దలను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. సైదిరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకులపై దాడు చేయించి కేసులు పెట్టారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. అలాంటి వ్యక్తి టికెట్‌ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. సైదిరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించమని ముక్తకంఠంతో నినదించినట్లు సమాచారం. అయితే ఇదే సందర్భంలో తెరపైకి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పేరు రావడం మరింత గందరగోళానికి తెరలేపినట్లయింది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తేరా చిన్నపరెడ్డి, ఎంపీ టికెట్ ఇస్తామంటే బీజేపీలో చేరేందుకు సిద్దమని సంకేతాలు పంపినట్లు తెలిసింది. బీజేపీ అధిష్ఠానం ఎంపీ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి పేరును పరిశీలిస్తున్నారని జిల్లా బీజేపీ నేతలు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)