ఇందిరమ్మ ఇళ్ల గైడ్​లైన్స్ విడుదల !

Telugu Lo Computer
0


తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం మార్గదర్శకాల్లో ప్రకటించింది. జిల్లా ఇన్ ఛార్జి మంత్రిని సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. కాగా  ఆర్థిక సహాయం పంపిణీకి గ్రామ, మండల స్థాయిలో అధికారులను ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేసిన అనంతరం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలల్లో జరిగే గ్రామ, వార్డు సభల్లో ప్రకటిస్తామని పేర్కొంది. కాంగ్రెస్ ఆరు హామీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున 4 లక్షల 50 వేల ఇళ్లను సొంత భూమి ఉన్న వారికి 100 శాతం సబ్సిడీతో మంజూరు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది. అంతేకాకుండా ప్రభుత్వ పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అయితే.. ఈ పథకాన్ని సోమవారం బూర్గంపాడులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రారంభించి పలువురు లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.

గైడ్​లైన్స్ : BPL కుటుంబాలకు చెందినవారై ఉండాలి, రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుని ఎంపిక చేస్తారు, లబ్ధిదారునికి సొంత ఖాళీ స్థలం ఉండాలి. లేదంటే ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాల్సింది, గుడిసె అయినా, గడ్డితో వేసిన పైకప్పు అయినా, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లు అయినా కూడా పథకానికి అర్హులు, అద్దె ఇంట్లో ఉంటున్న లబ్ధిదారులు కూడా అర్హులే, పెళ్లయినా.. ఉమ్మడి కుటుంబంలో జీవిస్తున్నా.. అర్హులైతే.. ఈ పథకానికి ఎంపిక చేస్తారు, ఒంటరి , వితంతు మహిళలు కూడా ఈ పథకానికి అర్హులు, లబ్ధిదారుడు గ్రామం లేదా మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి.

లబ్ధిదారుల ఎంపిక విధానం : అర్హులైన మహిళల పేరిట ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తారు, గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాత కలెక్టర్ లబ్ధిదారులను ఎంపిక చేస్తారు, లబ్ధిదారుల జాబితాను ముందుగా గ్రామసభలో సమర్పించి, పరిశీలించిన తర్వాతే ఖరారు చేస్తారు, ఆ తర్వాత జిల్లా ఇన్ చార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు, జిల్లాల్లో కలెక్టర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌లో కమిషనర్‌ ఎంపిక చేసిన బృందాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తాయి, 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టాలి. వంటగది మరియు బాత్రూమ్ విడివిడిగా ఉండాలి. ఇంటిని ఆర్‌సిసి పైకప్పుతో నిర్మించాలి.


Post a Comment

0Comments

Post a Comment (0)