నీతా అంబానీకి ప్రతిష్టాత్మక 'హ్యుమానిటేరియన్ అవార్డు'

Telugu Lo Computer
0


జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన 71వ మిస్ వరల్డ్ ఫైనల్స్ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ప్రతిష్టాత్మకమైన "బ్యూటీ విత్ ఎ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు"ని అందుకున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత మిస్‌ వరల్డ్‌ పోటీలకు భారత్ ఆతిథ్యమిస్తుంది.  మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ చైర్మన్‌ సీఈవో జూలియా మోర్లీ చేతుల మీదుగా నీతా అంబానీ ఈ మిస్‌ వరల్డ్‌ ఫౌండేషన్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డుని అందుకుంది. ఒక గృహిణిగా, సక్సెఫుల్‌ బిజినెస్‌ ఉమెన్‌గా నీతా అంబానీ ఎన్నో విజయాలు సాధించారు. అలాగే దాతృత్వంలో కూడా ఆమెకి సాటి లేరెవ్వరూ అని నిరూపించింది. నీతా అంబానీ చేసిన అశేష దాతృత్వ సేవలుఆమెకు దేశ విదేశాల్లో విశేషమైన కీర్తిని, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఓ మహిళ ఇల్లాలిగా ఉంటూ ఎలాంటి విజయాలను అందుకోగలదు అనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి నేటి యువతకు, భావితరాలను స్పూర్తిగా నిలిచింది. సామాజిక కార్యక్రమల పట్ల నీతా అంబానీకి ఉన్న అచంచలమైన నిబద్ధతతోపాటు సమాజంపై సానుకూత ప్రభావం చూపేలా ఆమె చేసిన అవిశ్రాంత ప్రయత్నాలకు గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంది. మిస్‌ వరల్డ్‌-2024 కిరీటాన్ని చెక్‌ రిపబ్లిక్‌ సుందర్‌ క్రిస్టినా పిజ్‌కోవా దక్కించుకున్నారు. భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన సిని షెట్టి ఐదవ స్థానంతో సరిపెట్టుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)