అనంత్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో ముకేశ్ అంబానీ భావోద్వేగం !

Telugu Lo Computer
0


నంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెండ్లి కొడుకు అనంత్ అంబానీ మాటలతో ముకేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లిదండ్రులకు అనంత్ అంబానీ కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు ముకేశ్ అంబానీ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తాను ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు తన తల్లిదండ్రులు అందించిన మద్దతు విషయం అనంత్ అంబానీ చెబుతున్నప్పుడు ముకేశ్ అంబానీ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. `ఇదంతా మా అమ్మ చేసింది. నాకోసం ఆమె చాలా కష్ట పడింది. ఆమె నాలుగు నెలలుగా రోజూ 18-19 గంటలు నాకోసం కష్టపడ్డారు. అందుకు అమ్మకు నేను కృతజ్ఞుడను. అమ్మా మీరు చేసిన ప్రతి పనికీ ధన్యవాదాలు అని అనంత్ అన్నాడు. 'మా అమ్మానాన్న ఎల్లవేళలా నాకు అండగా నిలిచారు. నేనేదైనా సాధించగలననే ఆత్మ విశ్వాసం నాకు కల్గించారు. నన్ను అర్థం చేసుకున్న మా అమ్మా నాన్నకు ఎప్పటికీ కృతజ్ఞుడను' అని అన్నారు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడుతూ తన చిన్న కొడుకులోనే మరణించిన తన తండ్రి ధీరూభాయ్ అంబానీని చూసుకుంటున్నట్లు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)