ఎన్నికల బరిలోకి పరిపూర్ణానంద స్వామి ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో పరిపూర్ణానంద స్వామి మీడియాతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఎంపీగా గెలిపిస్తే మాత్రం అభివృద్ధి బాటలో నడిపిస్తానని పేర్కొన్నారు. బీజేపీ అధిష్టానం పెద్దలు ఎంపీ సీటు తనకే కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆ నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఇప్పటికే హిందూపురంలో జాబ్ మేళా ఏర్పాటు చేశానని, 7 వేల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని చెప్పుకొచ్చారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పరిపూర్ణానంద స్వామి హామీ ఇచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)