ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎస్బీఐ !

Telugu Lo Computer
0


లక్టోరల్‌ బాండ్ల వ్యవహారంపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.బాండ్ల వివరాలను మార్చి 6 లోపు బహిర్గతపరచాలంటూ ఎస్బిఐ ని ఆదేశించింది. దీంతో అందుకు సమయం సరిపోదని, గడువు పొడిగించాలంటూ SBI సుప్రీంను ఆశ్రయించింది. జూన్ 30వ తేదీ వరకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. మరి బ్యాంకు వినతిపై అత్యున్నత ధర్మాసనం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.రాజకీయ పార్టీలకు రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం- సమాచార హక్కును ఉల్లంఘించడముతో పాటు రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణం కింద పేర్కొన్న భావప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. దీనిని వెంటనే నిలిపివేయాలంది.

Post a Comment

0Comments

Post a Comment (0)