భారతరత్న అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Telugu Lo Computer
0


న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతిభవన్‌లో భారత రాష్ట్రపతి ‍ద్రౌపది ముర్ము ఈరోజు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ఇటీవల భారతరత్న పొందిన వారు అవార్డులను స్వీకరించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్.. అలాగే, ఎమ్‌ఎస్‌ స్వామినాథన్, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌ను మరణానంతరం భారతరత్న అవార్డు వరించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు. చౌదరి చరణ్ సింగ్ తరపున ఆయన కుమారుడు జయంత్‌ చౌదరి. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్. స్వామినాథన్ తరపున  ఆయన కుమార్తె డాక్టర్ నిత్య భారతరత్న అవార్డులను అందుకున్నారు. అనారోగ్యం కారణంగా బీజేపీ సీనియర్ నేత అద్వానీ హాజరు కాలేకపోయారు. దీంతో, రేపుఎల్‌కే అద్వానీ ఇంటికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ వెళ్లి అవార్డును అందించనున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)