కవిత నేరం రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష !

Telugu Lo Computer
0


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కింద కేసు నమోదు చేసింది. అయితే ఈ పీఎంఎల్ఏ కేసులో నేరం రుజువైతే కనీసం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. అలాగే రూ.5లక్షల వరకు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. నేరం రుజువైతే ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోనుంది. కాగా పీఎంఎల్ఏ చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం 2002లో రూపొందించింది. ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె కుటుంబ సభ్యులను కలిసేందుకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. ప్రతిరోజు సా.6 నుంచి సా.7 గంటల వరకు కలిసేందుకు అవకాశం కల్పించింది. ఇవాళ ఆమెను భర్త అనిల్‌తో పాటు కేటీఆర్, హరీశ్ రావు, న్యాయవాదులు కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఆమెను ఈనెల 23 వరకు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు శనివారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్​లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కింగ్‌పిన్, ప్రధాన కుట్రదారు, మద్యం పాలసీకి ప్రధాన లబ్ధిదారు అని ఈడీ పేర్కొంది. ఆప్ ముఖ్య నేతలతో కుమ్మక్కైన కవిత.. సౌత్ గ్రూపుకు శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. మద్యం పాలసీ ద్వారా భారీ లాభాలు పొందేందుకు రూ.100 కోట్లు చందాలు చెల్లించినట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)