బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

Telugu Lo Computer
0


ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషిన్‌ను భారత అత్యున్నత తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పు చాలా హేతుబద్ధంగా ఉన్నట్లు తాము ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపింది. తీర్పును వెనక్కి తీసుకోవడంలో ఎటువంటి తొందరపాటు ఉండకూడదని, అది వేరేలా ఉంటే పరిగణనలోకి తీసుకునేవాళ్లమని పేర్కొంది. ఇది నిర్దోషిత్వం రుజువు చేసుకోవడానికి ఎంతో కష్టపడిన కేసు అని.. సాధారణంగా ఇటువంటి అప్పీల్‌ను ఈ న్యాయస్థానం గతంలోనే కొట్టివేసి ఉండాల్సిందని జస్టిస్‌లు మెహతా, గవాయిలు పేర్కొన్నారు. కాగా 90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబా.. మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయనతో పాటు మరో ఐదుగురికి మహారాష్ట్ర, గడ్చిరోలి ట్రయిల్‌ కోర్టు జీవిత ఖైదు విధించడంతో 2017 నుంచి నాగ్‌పూర్‌ జైలులోనే ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన 2014 నుంచి 2016 వరకు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)