భారాస సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పద్మారావుగౌడ్‌

Telugu Lo Computer
0


సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి భారాస అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌ను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు.1991 వరకు కార్పొరేటర్‌గా పనిచేసిన పద్మారావుగౌడ్‌ కాంగ్రెస్‌ నుంచి 2001లో తెరాసలో చేరారు. పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడిగా పనిచేస్తూ 2002లో కారు గుర్తుపై కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2004లో సికింద్రాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పద్మారావుగౌడ్‌ సనత్‌నగర్‌ నియోజకవర్గంలో పోటీచేసి.. కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఎక్సైజ్‌ శాఖ, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో గెలిచి ఉపసభాపతి అయ్యారు. 2023లో సికింద్రాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Post a Comment

0Comments

Post a Comment (0)