ఫెడరల్‌ బ్యాంక్‌ నుంచి కీ చైన్‌తో పేమెంట్స్‌ !

Telugu Lo Computer
0


ప్రైవేటు రంగానికి చెందిన ఫెడరల్‌ బ్యాంక్‌ ఫ్లాష్‌ పే పేరుతో రూపే స్మార్ట్‌ కీ చైన్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌ కీ చైన్‌తో కాంటాక్ట్‌ లెస్‌ చెల్లింపులు చేయొచ్చు. ప్రస్తుతం క్రెడిట్‌/ డెబిట్‌ కార్డుల్లో ఉన్న ట్యాప్‌ అండ్‌ పే ఫీచర్‌ తరహాలోనే ఇదీ పని చేస్తుంది. రూ.5 వేల వరకు పిన్‌ ఎంటర్‌ చేయకుండానే కాంటాక్ట్‌ లెస్‌ పేమెంట్లు చేయొచ్చు. ఆపై మొత్తానికి పిన్‌ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పీఓఎస్‌ మెషిన్ల వద్ద ఒక రోజు గరిష్ఠంగా రూ.లక్ష వరకు చెల్లింపు చేయొచ్చు. ఫ్లాష్‌ పే రూపే స్మార్ట్‌ కీ చైన్‌ ఉంటే బయటకు వెళ్లినప్పుడు క్రెడిట్‌, డెబిట్‌ కార్డు పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదని బ్యాంక్‌ పేర్కొంది. ఎన్‌పీసీఐతో కలిసి దీన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది.   ఫెడరల్‌ బ్యాంక్‌ కస్టమర్లకు దీన్ని జారీ చేస్తారు. సేవింగ్స్/ కరెంట్‌ ఖాతా ఉన్నవారు నెట్‌ బ్యాంకింగ్‌లోకి వెళ్లి ఈ స్మార్ట్ కీ చైన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఫెడరల్‌ బ్యాంక్‌ మొబైల్‌ యాప్‌, నెట్‌ బ్యాంకింగ్‌, ఐవీఆర్ కాలింగ్‌ ద్వారా పిన్‌ సెట్ చేసుకోవచ్చు. క్రెడిట్/ డెబిట్‌ కార్డు తరహాలోనే ఏ క్షణంలోనైనా బ్లాక్‌ చేసుకోవచ్చు. అన్‌బ్లాక్‌ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ కీ చైన్‌ ధరను రూ.499గా బ్యాంక్‌ నిర్ణయించింది. ఆ తర్వాత ఏడాదికి రూ.199 చొప్పున ఛార్జి చేస్తారు. పన్నులు అదనం. రూ.5వేల వరకు పిన్‌ అవసరం లేదు. టెర్మినల్‌కు 3-4 సెంటీమీటర్ల దూరం పేమెంట్లు చేయొచ్చు. రోజులో ఐదు లావాదేవీలకు అనుమతిస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)