రామేశ్వరం హోటల్‌ పేలుళ్ల సూత్రదారి సలీం అరెస్ట్‌ !

Telugu Lo Computer
0


బెంగళూరు వైట్‌ఫీల్డ్‌ రామేశ్వరం హోటల్‌లో పేలుళ్ల ఘటన సూత్రధారి సలీంను ఎన్‌ఐఎ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. రెండ్రోజులుగా సాగించిన అన్వేషణలో భాగంగా శనివారం ఎన్‌ఐఎ అధికారులు ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట దగ్గర మారుమూల గ్రామం చెర్లోపల్లెలో ఒక ప్రార్థన మందిరంలో ఉండగా సలీంను అదుపులోకి తీసుకున్నారు. మైదుకూరు నుండి పది కిలోమీటర్ల పరిధిలోని తెలుగు గంగ కాలువకు సమీపంలోని పప్పనపల్లె పంచాయతీ చెర్లోపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన సదరు ప్రార్థన మందిరంలో కొన్ని బాధ్యతల నిర్వహణ కోసం ఆయన ఇటీవల నియమితులైనట్లుగా చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)