కుల్ఫీ ఐస్‌ క్రీమ్‌లో వీర్యం కలిపిన విక్రయదారుడు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని వరంగల్‌-నెక్కొండ మార్గంలో ఓ వ్యక్తి కుల్ఫీ ఐస్‌ క్రీమ్‌ విక్రయిస్తున్నాడు. అయితే రోడ్డుపై ఎవరూ లేరని భావించి ఏం చూశాడో తెలియదు కానీ వెంటనే ప్యాంట్‌లోకి చేయి పెట్టాడు. రోడ్డు మీద ఉన్నాననే సోయి కూడా మరచి 'ఆ పని' కానిచ్చాడు. చివరగా వీర్యాన్ని ఐస్‌క్రీమ్‌లో కలిపివేశాడు. ఈ దారుణాన్ని రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తి రహాస్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. బండి చాటుకు అతడు చేసిన ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. వీడియో తీసిన అనంతరం స్థానికులు అతడిని దేహశుద్ధి చేశారని సమాచారం. వరంగల్‌ జిల్లాలో ఐస్‌క్రీమ్‌ విక్రయాలపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయి. విక్రయించేవారు అపరిశుభ్రంగా తయారుచేస్తున్నారని.. ఐస్‌క్రీమ్‌ దారుణంగా చేస్తున్నారని గుర్తించారు. వీటిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ముఖ్యంగా నెక్కొండలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిసింది. అయితే వీడియోలో కనిపించిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వీర్యం కలిపిన ఐస్‌క్రీమ్‌ను పారబోశారు. నిందితుడు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి అని తెలిసింది. ఈ పరిణామంతో వరంగల్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. వేసవి నేపథ్యంలో ఐస్‌క్రీమ్‌, పాల పదార్థాలు, జ్యూస్‌లు, కూల్‌డ్రింక్స్‌ దుకాణాలపై ప్రత్యేకంగా తనిఖీలు చేస్తామని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)