విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ ఫ్లై91 ?

Telugu Lo Computer
0


విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ వచ్చింది. కొత్తగా ఏర్పాటైన ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై91కు  డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్ సివిల్‌ ఏవియేషన్‌ బుధవారం ఎయిర్‌ ఆపరేటర్స్‌ సర్టిఫికెట్‌ను మంజూరుచేసింది. ఇప్పటికే అన్ని అనుమతులు  పొందిన నేపథ్యంలో త్వరలో వాణిజ్య సేవలను ప్రారంభించనుంది. లక్షద్వీప్‌ నుంచి దేశంలోని వివిధ నగరాలకు ఈ విమాన సంస్థ సర్వీసులు నడపనుంది. భారత్‌ టెలికాం కోడ్‌ 91ను ఈ విమానయాన సంస్థకు జోడించారు. కేరళకు చెందిన మనోజ్‌ చాకో.. ఫెయిర్‌ఫ్యాక్స్‌ ఇండియా మాజీ హెడ్‌ హర్ష రాఘవన్‌తో కలిసి ఈ కంపెనీని నెలకొల్పారు. చాకో గతంలో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఎమిరేట్స్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ విమాన సంస్థల్లోనూ వివిధ హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం ఈ విమానయాన సంస్థకు రెండు ఏటీఆర్‌-72 విమానాలు ఉన్నాయి. సెప్టెంబర్‌కల్లా మరో నాలుగు విమానాలు, ఆపై ఏటా ఆరేసి చొప్పున రాబోయే ఐదేళ్లలో విమానాలు జోడించనుంది. గోవా, బెంగళూరు, హైదరాబాద్‌, అగట్టి, సింధ్‌ దుర్గ్‌, జలగావ్‌ మధ్య ఉడాన్‌ స్కీమ్‌ కింద రూట్లను ప్రభుత్వం కేటాయించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)