ఆంధ్రప్రదేశ్ లో బస్సు బోల్తా పడి 40 మందికి తీవ్రగాయాలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం బస్సు బోల్తా పడి 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. పుట్టు వెంట్రుకల మొక్కును తీర్చుకునేందుకు బాపట్ల జిల్లా తాళ్తూరు మండలం బొద్దికూరపాడు, దర్శి మండలం కొర్లమడుగు గ్రామాలకు చెందిన 60 మంది ప్రైవేట్‌ బస్సులో కోటప్పకొండకు బయలు దేరారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద బస్సు కట్టర్‌ విరిగిపోవడంతో రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని ప్రైవేట్‌ వాహనాల్లో అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరికొందరిని ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)