మాల్దీవులకు 33 శాతం తగ్గిన భారత టూరిస్టులు !

Telugu Lo Computer
0


మాల్దీవులకు కొత్త అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జూ వచ్చిన తర్వాత భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన తాజా నివేదిక ప్రకారం ఆ దేశానికి వెళ్తున్న భారత పర్యాటకుల్లో గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది 33 శాతం తగ్గింది. మార్చి 2023లో, 41,000 మంది భారతీయ పర్యాటకులు మాల్దీవులను సందర్శించారని, మార్చి 2024లో ఆ సంఖ్య కేవలం 27,224కి పడిపోయిందని, 33 శాతం క్షీణతను చూపుతుందని నివేదిక తెలిపింది. మార్చి 2023 వరకు, మార్కెట్‌లో 10 శాతం వాటాతో మాల్దీవులకు భారతదేశం రెండో అతిపెద్ద పర్యాటక వనరుగా ఉంటే, ప్రస్తుతం ఆరు శాతంతో ఆరో స్థానానికి పడిపోయింది.భారత పర్యాటకులు తగ్గుతుంటే, మరోవైపు చైనా నుంచి పర్యాటకుల సంఖ్య అకాస్మాత్తుగా పెరిగింది. మాల్దీవులు-చైనా సంబంధాలు బలపడుతున్న వేళ 2024లో ఆ దేశానికి 54,000 చైనా పర్యాటకులు వెళ్లారు.


Post a Comment

0Comments

Post a Comment (0)