2026 నాటికి దేశంలో బుల్లెట్ ట్రైన్ !

Telugu Lo Computer
0


భారత దేశపు మొట్ట మొదటి బుల్లెట్ రైలు 2026 నాటికి సిద్ధమవుతుందని  కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ రైజింగ్ భారత్ సమ్మిట్ 2024 లో వెల్లడించారు. ''మోడీ ప్రభుత్వ పదేళ్ల పాలనలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోని రైల్వేలైన్లలో వంద శాతం విద్యుదీకరణ సాధించాం. 40 వేల కిలోమీటర్ల రైల్వే విద్యుద్దీకరణ జరిగింది. 60 ఏళ్లలో 20 వేలు చేస్తే. . గత పదేళ్లలోనే 40 వేలు కి.మీ. విద్యుదీకరణ చేశాం. సుమారు 30 వేల కొత్త రైల్వే ట్రాక్‌లను నిర్మించాం. గత ఏడాది ఐదు వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్ లను అనుసంధానించాం. ఈసారి కూడా ఇప్పటివరకు ఐదు వేలకు పైగా రైల్వే ట్రాక్ లను అనుసంధానం చేశారు. వందేభారత్ రైలు ద్వారా మధ్యతరగతి, ఆశావహ యువతకు ప్రపంచంలోనే అత్యుత్తమ రైల్వే వ్యవస్థ అనే అనుభవం లభిస్తోంది. నమో భారత్ రైలు విజయవంతమైంది. అమృత్ భారత్ రైలు కూడా వస్తోంది. 2014 వరకు రైల్వేను పాలిచ్చే ఆవుగానే చూసేవారు. రైళ్లను పొడిగించడం, కొత్త రైళ్లను ప్రకటించడం తప్ప ఏమీ చేయలేదు. ట్రాక్ సామర్థ్యాన్ని పట్టించుకునేవారు కాదు.మోదీ వచ్చాక అన్నింటినీ అభివృద్ధి చేస్తున్నాం '' అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.  న్యూఢిల్లీలో ప్రారంభమైన సీఎన్ఎన్ న్యూస్ ''రైజింగ్ ఇండియా సమ్మిట్'' గురువారం రాత్రి వరకు కొనసాగుతుంది. బుధవారం ఉదయం కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, నితిన్ గడ్కరీ ప్రసంగించారు. అయోధ్య రామ్ మందిర్ ఆర్కిటెక్ట్ ఆశిష్ సోంపురా, బాలరాముడి నగల డిజైనర్ యతిందర్ మిశ్రా మాట్లాడారు. రాజకీయాలు, కళలు, కార్పొరేట్ ప్రపంచం, వినోదం, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమ్మిట్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశ అద్భుతమైన పరివర్తన ప్రయాణాన్ని అన్వేషించడానికి ఒక వేదికగా నిలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)